జార్ఖండ్‌లో మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి హేమంత్ సోరెన్ అధిరోహించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనుమతి లభించింది. ఈరోజు హేమంత్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అంతకుముందు ఉదయం హేమంత్ సోరెన్ కూటమిలో చేరిన కాంగ్రెస్ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కోరారు.
READ MORE: Niharika NM : నక్క తోక తొక్కిన నిహారిక.. ఏకంగా గీతా ఆర్ట్స్ సినిమాతో?
జార్ఖండ్ ముక్తిమోర్చ (JMM) కార్యనిర్వాహక అధ్యక్షుడైన హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు జనవరి 31న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భూ కుంభకోణం కేసులో దాదాపు ఐదు నెలల జైలు జీవితం గడిపిన సోరెన్ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. తన అరెస్టుకు కొద్దిగంటల ముందే నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎంగా చంపాయి సోరెన్ బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. తాజాగా చంపాయి బుధవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి హేమంత్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అనంతరం హేమంత్ బుధవారం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు దావా వేశారు. దీంతో హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా.. బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేయడానికి ఈడీ త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.