Site icon NTV Telugu

Kalpana Soren: జైల్లో హేమంత్‌ సోరెన్‌.. పెళ్లి రోజు సతీమణి ఎమోషనల్‌ పోస్ట్‌

Kalpana Soren

Kalpana Soren

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే, ఇవాళ తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన భార్య కల్పనా సోరెన్‌ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్టు పెట్టింది. జార్ఖండ్‌ను కాపాడేందుకు హేమంత్‌ సోరెన్‌ పోరాటం చేస్తున్నారు.. కొందరు చేస్తున్న కుట్రకు ఆయన తల వంచలేదు.. ఓటమిని అంగీకరించలేదన్నారు. నేడు మా 18వ పెళ్లి రోజు కానీ, ప్రస్తుతం తను కుటుంబంతో లేరు.. అయినా నేనేమీ బాధపడట్లేదు.. ఎందుకంటే నేనొక వీరుడి భార్యను.. ఆయనలా క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉంటాను. నా మొహంపై చిరునవ్వు చెదరనివ్వకుండా హేమంత్ సోరెన్ కు అండగా ఉంటాను అని కల్పన సోరెన్ వెల్లడించింది.

Read Also: Special Train to Ayodhya: ఏపీ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు.. జెండా ఊపి ప్రారంభించిన పురంధేశ్వరి

అయితే, మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్‌ సోరెన్‌ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ల్యాండ్ స్కాం కేసులో లోతైన విచారణ చేసిన ఈడీ అధికారులు జనవరి 31వ రోజు అర్థరాత్రి అరెస్ట్ చేశారు. దీంతో ఆయన తన సీఎం పదవికి రిజైన్ చేసిన తర్వాత జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. చివరకు జేఎంఎం సీనియర్‌ నేత చంపై సోరెన్‌ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించారు.

Exit mobile version