Site icon NTV Telugu

Hemant Soren: జార్ఖండ్ సీఎంగా మరోసారి హేమంత్ సోరెన్: మంత్రి సత్యానంద్ భోక్తా..

Hemanth Soren

Hemanth Soren

Hemant Soren: ఇవాళ (బుధవారం) రాంచీలో జరగనున్న అధికార ఎమ్మెల్యేల సమావేశంలో హేమంత్ సోరెన్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికవడం ఖాయం అని మంత్రి సత్యానంద్ భోక్తా ప్రకటించారు. త్వరలోనే సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు అని చెప్పారు. శాసనసభా పక్ష సమావేశంలో హేమంత్ సోరెన్‌ను నాయకుడిగా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని పేర్కొన్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత చంపై సోరెన్ తన పదవికి రాజీనామా చేయనున్నారు.. ఆ తర్వాత హేమంత్ సోరెన్ కొత్త ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు అని చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు ఇతర మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేసే ఛాన్స్ ఉంది. మంత్రుల జాబితాలో తన పేరు కూడా ఉందన్నారు. ఇదే జరిగితే ఛత్రం నుంచి ఐదోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తొలి ఎమ్మెల్యేగా తాను ఉంటాను అని సత్యానంద్ భోక్తా వెల్లడించారు.

Read Also: CMRF Applications: జులై 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులు.. ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరణ..

అయితే, ల్యాండ్ స్కా్మ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నా.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన పదవీకి రాజీనామా చేసిన తర్వాత ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఆయన దాదాపు 10 నెలల పాటు సెంట్రల్ జైలులో ఉన్నారు. తాజాగా, బెయిల్ పై విడుదలైన సోరెన్ ను ఈరోజు జేఎంఎం పార్టీ శాసన సభా అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉంది.. ఇదే జరిగితే.. మరోసారి హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా తొందరలోనే ప్రమాణస్వీకారం చేస్తారు.

Exit mobile version