NTV Telugu Site icon

Helicopter Crash: కేదార్‌నాథ్‌లో కూలిపోయిన హెలికాప్టర్..

Helicopter

Helicopter

Helicopter Crash: కేదార్‌నాథ్‌లో ఇటీవల ఒక క్రెస్టల్‌ హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ టైంలో దెబ్బతింది. దీనిని తరలించేందుకు సైన్యం ఎంట్రీ ఇచ్చింది. ఆర్మీ ఎంఐ-17 ఛాపర్‌ను రప్పించారు. దీనికి ప్రత్యేకమైన కేబుల్స్‌తో క్రెస్టల్‌ హెలికాప్టర్‌ను కట్టి ఇవాళ ఉదయం తరలించారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత కేదార్‌నాథ్‌- గచౌర్‌ మధ్య భీంబాలి ప్రాంతంలో ఎంఐ-17 హెలికాప్టర్‌కు అమర్చిన తీగలు ఒక్కసారిగా తెగిపోయాయి. కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి క్రెస్టల్‌ హెలికాప్టర్‌ కొండపైన పడిపోయింది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు.

Read Also: Jagtial Crime: నా భార్య కత్తితో దాడి చేసింది.. నేను కాదంటున్న భార్య..

కాగా, ఇటీవల ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్‌ యాత్రను ఆగస్టు నెలలోనే అధికారులు నిలిపివేశారు. దీంతో యాత్రికులు వాయుమార్గంలో ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ క్రెస్టల్‌ హెలికాప్టర్‌ను యాత్రికులను తరలించేందుకు ఉపయోగిస్తున్నారు. మరోవైపు వర్షాల కారణంగా గౌరీకుండ్‌- కేదార్‌నాథ్‌ల మధ్య చిక్కుకుపోయిన వేలాది మంది యాత్రికులను రక్షించేందుకు ఇండియన్ సైన్యం, వాయుసేన చినూక్‌, ఎంఐ-17 హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి.