NTV Telugu Site icon

Heeraben Modi Last Rites: కాసేపట్లో హీరాబెన్‌ మోదీ అంత్యక్రియలు

Pm Modi

Pm Modi

Heeraben Modi Last Rites: ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ శుక్రవారం శివైక్యం చెందారు. అస్వస్థతతో అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా హాస్పిటల్‌లో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరికాసేపట్లో గాంధీనగర్‌లో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతిమయాత్రలో భాగంగా ప్రధాని మోదీ తన మాతృమూర్తి పాడె మోశారు. అంతిమయాత్ర వాహనంలో మాతృమూర్తి పక్కనే కూర్చున్నారు. సన్నిహితులకు మాత్రమే అంతిమక్రియల్లో పాల్గొనేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది.

ప్రధాని తల్లి హీరాబెన్‌ మోడీకి సంబంధించిన విషయాలివే..

తల్లి మృతితో ప్రధాని మోదీ భావోధ్వేగపూరిత ట్వీట్‌ చేశారు.. ‘నిండు నూరేండ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుని పాదాల చెంత విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది. ఆమెలో తాను ఎప్పుడూ త్రిమూర్తులను చూశాను. ఆమె ఒక నిస్వార్ధ కర్మయోగి. విలువలకు నిలువెత్తు నిదర్శనం’ అని చెప్పారు.

Show comments