NTV Telugu Site icon

Heavy rainfall warning: ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Hevay

Hevay

దేశంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. పలు రాష్ట్రాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరికొన్ని చోట్లు కొండచరియలు విరిగిపడిపోవడం.. ఇంకొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటికే సిక్కింలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొండచరియలు విరిగి ఇళ్లు ధ్వంసం అయ్యాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇది కూడా చదవండి: Darshan: కరెంట్ షాకిచ్చి, శాకాహారయినా ఎముకలు నోట్లో కుక్కి రేణుకా స్వామికి టార్చర్

ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను వాతావరణ శాఖ విడుదల చేసింది. సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్‌లో రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వచ్చే రెండు రోజుల్లో బీహార్, జార్ఖండ్, ఒడిశాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా..?