NTV Telugu Site icon

Delhi : ఢిల్లీలో తుఫాను, వర్షం విధ్వంసం.. ముగ్గురు మృతి, 23 మందికి గాయాలు

New Project (21)

New Project (21)

Delhi : దేశ రాజధాని ఢిల్లీని శనివారం రాత్రి భీకర తుపాను తాకింది. ఈ తుపాను ధాటికి పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచాయి. తుపాను సంబంధిత ఘటనల్లో 19 ఏళ్ల యువతితో సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 23 మంది గాయపడ్డారు. అలాగే ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల గోడలు కూలిపోయాయి. శుక్రవారం అర్థరాత్రి దేశ రాజధానిని తాకిన ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

షాహీన్‌బాగ్‌లో భవనం గోడలో కొంత భాగం ఆమెపై పడడంతో 19 ఏళ్ల షిరీన్ అహ్మద్ తీవ్రంగా గాయపడినట్లు పోలీసు అధికారి తెలిపారు. తీవ్రంగా గాయపడిన షిరిన్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి పక్కనే ఉన్న భవనం పై అంతస్తు యజమానిపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

Read Also:KKR vs MI: ముంబై ఘోర పరాభవం.. ప్లేఆఫ్స్ చేరిన కోల్‍కతా..

ఇది కాకుండా, పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో జనక్‌పురి ఫ్లైఓవర్ సమీపంలో చెట్టు కొమ్మ పడిపోవడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి మరణించాడు. క్రేన్ సహాయంతో కొమ్మను తొలగించామని, ఘటనలో బాధితుడు జైప్రకాష్‌ను దీనదయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించామని, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు కూడా ధ్వంసమైందని, అయితే అందులోని వ్యక్తులు సురక్షితంగా ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు.

మూడవ సంఘటన రాత్రి 11 గంటల సమయంలో కేఎన్ కట్జూ మార్గ్‌లోని ఐబీ బ్లాక్ సమీపంలో జరిగింది. ఒక కార్మికుడు చెట్టు పడిపోవడంతో కింద చిక్కుకున్నాడు. హరియోమ్ అనే ఈ కార్మికుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చెట్లను కూల్చివేయడం, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు నేలకూలడం వంటి సంఘటనలకు సంబంధించి తమకు 152 కాల్‌లు వచ్చాయని, వాటిలో 130 ఢిల్లీ అగ్నిమాపక శాఖ (DFS)కి అందించబడ్డాయి.

Read Also:Rajamouli : నా కెరీర్ లో ఆ సినిమా చేసిన మ్యాజిక్ ఎప్పటికి మర్చిపోలేను..