NTV Telugu Site icon

Warangal Police: నేడు వరంగల్‌లో సీఎం పర్యటన.. నిరసనకారులపై పోలీసుల ప్రత్యేక నిఘా..

Warangal Police

Warangal Police

Warangal Police: నేడు వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో వరంగల్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిరసనకారులపై ప్రత్యేక నిఘా పెట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పోలీసు అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కమిషనరేట్ తో పాటు ఇతర జిల్లాల నుంచి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాళోజీ కళాక్షేత్రం ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రౌండ్, సీఎం కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో ఎస్ బి, ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసుల ప్రత్యేక దృష్టి పెట్టారు. మూడంచల భద్రతా చర్యలు చేపట్టారు. అపరిచిత వ్యక్తుల కదలికలను పసిగట్టేందుకు టాస్క్ ఫోర్స్ టీంలతోపాటు క్రైమ్ లాండ్ ఆర్డర్ పోలీసులు మఫ్తి లలో విధులు నిర్వహించనున్నారు. సుమారు 1500 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. అందులో వరంగల్ కమిషనరేట్ పరిధిలో 800 మంది ఇతర జిల్లాల నుండి 700 మంది 7 గురు ఎస్సైలు, 20 మంది డిఎస్పీలు విధులు నిర్వహించనున్నారు. అలాగే గ్రౌండ్ లో కూడా హెలిపాడ్ దిగి ఆర్ట్ కళాశాల సభాస్థలికి చేరుకొని తిరిగి హైదరాబాద్ పయనం అయ్యేవరకు ఎలాంటి అలజడికి తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.
Warangal: వరంగల్ కు సర్కార్ వరాల జల్లు… పూర్తిగా మారనున్న రూపురేఖలు..

Show comments