NTV Telugu Site icon

Mohan Babu University: మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర భారీ భద్రత..

Mbu

Mbu

Mohan Babu University: మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.. తన కుమారుడు మంచు మనోజ్‌.. ఎంబీయూకు వస్తారన్న సమాచారంతో పోలీసులను ఆశ్రయించారు మోహన్‌బాబు.. మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ రాకూడదంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో.. పోలీసులకు ఆ కోర్టు ఉత్తర్వుల గురించి సమాచారం ఇచ్చారు మోహన్ బాబు.. ప్రస్తుతం యూనివర్సిటీ క్యాంపస్ లోనే మోహన్ బాబు ఉన్నారు.. అయితే, మోహన్ బాబు సమాచారం మేరకు యూనివర్సిటీ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.. కాసేపట్లో మంచు మనోజ్‌.. ఎంబీయూ వద్దకు రానున్న నేపథ్యంలో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది..

Read Also: Road Accident: శ్రీశైలం శిఖరం సమీపంలో ప్రమాదం.. ఘాట్‌ రోడ్డులో అదుపు తప్పిన కారు

కాగా, మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం ఇప్పుడిప్పుడే చల్లబడినట్టు కనిపించింది.. ఈ మధ్యే గతం గతహా.. నిన్న జరిగింది మార్చిపోవాలి, ఈ రోజు ఏం చేయాలో అది చేయాలంటూ మంచు మోహన్‌బాబు పేర్కొన్నారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు మరో కొత్త టెన్షన్‌ మొదలైంది.. మంచు మనోజ్ తిరుపతి పర్యటనకు వచ్చారు.. ఈ పర్యటనలో మోహన్‌బాబు యూనివర్సిటీ కూడా ఉండడం ఇప్పుడు అసలు టెన్షన్‌కు కారణమైంది.. మరోవైపు.. యూనివర్సిటీలోనే కుటుంబ సభ్యులతో కలిసి భోగి, సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మంచు విష్ణు.. నిన్నే బయల్దేరి వెళ్లిపోయారట.. ప్రస్తుతం క్యాంపస్‌లోనే ఉన్నారు మోహన్‌బాబు.. ఇప్పటికే పోలీసులకు కోర్టు ఉత్తర్వుల గురించి సమాచారం ఇవ్వడం.. పోలీసులు యూనివర్సిటీ దగ్గర మోహరించడంతో.. ఏం జరగబోతోంది? అనేది ఉత్కంఠగా మారిపోయింది..

Show comments