NTV Telugu Site icon

భాగ్యనగరం​లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ వ‌ర్షానికి రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి.. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర్షం నీరు చేర‌డంతో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.