Tamilnadu Rains: తమిళనాడు అంతర్భాగంలో వాతావరణం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదువాయి, కారైకల్ లోని కొన్ని చోట్ల రానున్న 6 రోజులు, సెప్టెంబరు 28, 29 తేదీల్లో కోయంబత్తూర్, నీలగిరి, తిరుపూర్, దిండిగల్, తేని, మదురై సహా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. విరుదునగర్, తెంకాసి, తిరునల్వేలి, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కన్యాకుమారి సహా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
Bigg Boss 8 : బిగ్ బాస్ ముద్దుబిడ్డ కోసం ఆ కంటెస్టెంట్ బలి.. మరీ ఇంత అన్యాయమా ?
ప్రస్తుత వర్షలకి నీలగిరి జిల్లాలో నీటమునిగాయి పలు ప్రాంతాలు. అలాగే కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని., మదురై, తేని, ఈరోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఆకాశం ఉందని., ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. తమిళనాడులోని అంతర్భాగాల్లో వాయుగుండం అధోముఖంగా ప్రబలుతోందని., దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోని కొన్ని చోట్ల, దక్షిణ తమిళనాడులోని కొన్ని చోట్ల, పుదువై, కారైకల్‌లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెంగల్‌పట్టు, రాణిపేట్, వేలూరు, కాంచీపురం, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, విల్లుపురం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది.