NTV Telugu Site icon

Mumbai Rains: ముంబైని ముంచెత్తిన వర్షం.. అల్లకల్లోలంలో ఆర్థిక నగరం

Mumbai Rains

Mumbai Rains

భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత 5 రోజులుగా వర్షాలు కురుస్తాయని.. భారత వాతావరణశాఖ హెచ్చరించిన కొన్ని గంటలకే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైతో పాటూ.. పుణె, నాగపూర్‌లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 మధ్య.. కేవలం 3 గంటల్లో ముంబైలో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా నిన్న( శనివారం) 10 సెంటీమీటర్ల వాన కురవడంతో.. రోడ్లు, కాలనీలు, వీధులన్నీ జలమయం అయ్యాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 8.30 నాటికి ముంబైలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Read Also : Wild Murder: వికారాబాద్‌లో ఆటవిక ఘటన.. ముక్కు, చెవులు, నాలుక కోసి హత్య

ముంబై సముద్ర మట్టానికి సమాంతరంగా ఉంది. అందువల్ల ప్రతీ సంవత్సరం.. సముద్ర మట్టం పెరుగుతుంది. దానికి తోడు ఈ భారీ వర్షాలు ముంబైని ముంచేస్తున్నాయి. ముంబై మహా నగరంలో నిరు పేదలు, కూలీలు, వలస కార్మికులు కోట్లలో ఉన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చి.. స్లమ్ ఏరియాస్‌లో నివసిస్తున్న వారు చాలా మందినే ఉన్నారు. వారికి ఈ భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి.

Read Also : Anil Kumar Yadav: ఆనంకి ఎమ్మెల్యే అనిల్ ఛాలెంజ్.. ఓడిపోతే తప్పుకుంటా

ముంబైకి ఇవాళ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అందువల్ల ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఈ వీకెండ్ వర్షంతో ముగిసేలా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్యే బిపర్‌ జోయ్ తుఫాన్ వల్ల గుజరాత్‌తో పాటూ.. ముంబైలోనూ భారీ వర్షాలు కురిశాయి. అవి ముగియగానే నైరుతి రుతుపవనాల రాకతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Read Also : Success Love: లవ్‌లో సక్సెస్ కావాలంటే ఇందులో ఓడిపోవాల్సిందే..!

ప్రస్తుతం విమాన, రైల్వే సేవలకు అంతరాయం కలగడం లేదు.. అయితే.. భారీ వర్షాలు ఇలాగే కురుస్తుంటే.. ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేసే పరిస్థితి ఉంటుంది. మొత్తంగా ఈ సంవత్సరం మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు పడకపోవచ్చని అంచనా వేశారు. ఆలస్యంగా నైనా నైరుతీ రుతుపవనాలు పలకరించింది. ఈ వానలు ఇలాగే 5 రోజులు కురిస్తే.. ముంబైలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది.