తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఇంకా కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు ..వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.పెన్నా నదికి వరద ప్రవాహం పెరగడంతో. సోమశిల జలాశయం నుంచి నీటి విడుదలను పెంచుతున్నారు. గూడూరు. నాయుడుపేట డివిజన్ లలో వరద ప్రభావం అధికంగా ఉండటంతో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు..నెల్లూరు జిల్లాలో వరదల పరిస్థితి పై మా ప్రతినిధి అమర్ నాథ్ మరిన్ని వివరాలు అందిస్తారు. తిరుమల ఘాట్ రోడ్డులో వృక్షాలు కూలడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం వరకు మెట్ల మార్గం వైపు నుంచి భక్తులను అనుమతించలేదు.
Also Read : Suicide in Public Toilet: పబ్లిక్ టాయిలెట్‌లో మహిళ ఆత్మహత్య..!
బాపట్ల జిల్లా చీరాల వాడరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం తీరానికి రెండు కిలోమీటర్ల తీరంలో వారిని గుర్తించిన అధికారులు వారిని సురక్షితంగా తీరానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీరు ఆరు రోజుల క్రితమే వేటకు వెళ్లగా తుపాను ప్రభావంతో సిగ్నళ్లు లేక దారి తెలియక చిక్కుకుపోయారు. సిగ్నళ్లు అందిన తర్వాత మెరైన్ పోలీసులకు సమాచారం అందించడంతో వారి జాడ తెలిసింది. పలు జిల్లాల్లోని వరి, అరటి, పత్తి, వేరుశనగ, మినుము, బొప్పాయి, మిరప సహా వేలాది ఎకరాల్లోని పంటలు ధ్వంసమయ్యాయి. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం దర్జిపల్లిలో ఓ ఇంటిగోడ కూలి ఓ మహిళ మృతి చెందింది.
