Site icon NTV Telugu

Hyderabad Rains : హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

Rains In Hyd

Rains In Hyd

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. గత రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. సెప్టెంబర్‌ వరకే శాంతించాల్సిన వరుణుడు.. అక్టోబర్ మూడో వారం వచ్చినా ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు భారీగా కురస్తున్నాయి.

 

అయితే.. మలక్ పేట, చార్మినార్, రాజేంద్రనగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, అంబర్ పేట్, ఎల్బీనగర్, హయత్ నగర్, రామాంతపుర్, ఉప్పల్, బేగంపేట్, అమీర్ పేట్, మైత్రివనం, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బాలానగర్‌, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, నాంపల్లి, కోఠి, మెహదీపట్నం, ఎస్ ఆర్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గచ్చిబౌలి లో అత్యధికంగా 5.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమైదైంది. హయత్ నగర్‌లో 3.9 సెంటీ మీటర్లు , జూ పార్క్ వద్ద 3.7 సెంటీమీటర్లు, బండ్ల గూడలో 3.1 సెంటీ మీటర్లు, దూధ్ బౌలిలో 3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Exit mobile version