Site icon NTV Telugu

Hyderabad Rains: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. రోడ్లు జలమయం

Hyderabad Rains

Hyderabad Rains

Hyderabad Rains: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. గత మూడు రోజులుగా కాస్త పొడి వాతావరణం ఉన్నా మళ్లీ ఇవాళ ఉదయం నుంచి ముసురు కమ్మేసింది. నగరంలోని అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, సోమాజీగూడ, కోఠి, అబిడ్స్ , ఎస్ఆర్ నగర్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పాఠశాలలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు అవస్థలు పడ్డారు.

Bhagyanagar Ganesh Utsav Samithi: తగ్గేదే లే… హుస్సేన్‌ సాగర్‌లోనే నిమజ్జనం చేసి తీరుతాం..

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో షియర్‌ జోన్‌ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు హైదరాబాద్‌ సహా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు నగర ప్రజలకు కీలక సూచన చేశారు. ఆగి ఆగి కొడుతున్న వర్షం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే వర్షం ఆగగానే ఆగమాగం బయటకు రావద్దని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచించారు. కొద్ది సమయం తర్వాతే బయటకు రావాలని.. అప్పుడే ట్రాఫిక్‌ సమస్యల నుంచి బయటపడొచ్చని తెలిపారు. భారీ వర్షాలతో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్‌లో ఇరుక్కపోవచ్చు. కావున కాస్త చూసుకుని బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ ప్రజలను కోరుతోంది.

Exit mobile version