హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీగానే వర్షం పడుతోంది. నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్ పేట్, భరత్ నగర్, సనత్ నగర్, మారేడ్ పల్లి, బోయిన్ పల్లి, కుత్బుల్లాపూర్, అడ్డగుట్ట, బన్సీలాల్ పేట, బేగంపేట, రాణీగంజ్, సికింద్రాబాద్, పద్మారావు నగర్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, చంద్రాయన్ గుట్ట, కోఠి, కాచిగూడ, నారాయణ గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, రామ్ నగర్ ఇలా సిటీలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
Taapsee Pannu: రెడ్ వైన్ ల మెరిసిపోతున్న తాప్సీ పన్ను
వర్షం గంట నుండి కురుస్తుండటంతో జనం ఎక్కడికక్కడే స్తంభించిపోయారు. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ సిటీలో గత రెండు మూడు రోజుల నుండి సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఇకపోతే హైదరాబాద్ జంట నగరాలలో వాన దంచికొట్టనున్నట్లు వాతావవరణ శాఖ తెలిపింది. ఇక నేడు సాయంత్రం మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Kalki 2898 AD : ఓవర్సీస్ లో ‘కల్కి’ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్..కేవలం నాలుగు గంటల్లోనే ఏకంగా..?
నగరంలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉండటంతో హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, సేరిలింగంపల్లి లతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఇక జూన్ 10 వరకు జంట నగరాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. అలాగే జూన్ 11 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో వర్షం పడే అవకాశం ఉందని సమాచారం.