Site icon NTV Telugu

Heavy Rains in Andhra Pradesh: ఏపీలో భారీ వర్షాలు.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Rains

Rains

Heavy Rains in Andhra Pradesh: నేడు, రేపు రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారిపోయింది.. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని.. విశాఖకు 380 కిలో మీటర్లు, పారాదీప్ కు 480 కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ దీఘాకు దక్షిణంగా 630 కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ కెపురాకు 780 కిలో మీటర్ల దూరంలో కేద్రీకృతం అయిఉన్నట్టు తెలిపింది.. గడచిన 6 గంటల్లో 13 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం పయనిస్తోన్నట్టు తెలిపిన వాతావరణ.. రేపు తీవ్ర వాయుగుండంగా పశ్చిమ బెంగాల్ తీరం మోన్గ్లా ఖేపురా మధ్య తీరం దాటే ఆవకాశం ఉందని పేర్కొంది.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చాల చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు అవకాశం ఉందని తెలిపింది.. ఇక, తీరం వెంబడి గాలులు 45-55 కిలోమీటర్లు వేగంతో వీచే ఆవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు అని హెచ్చరించింది.. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చిరిక.. కాకినాడ, గంగవరం పోర్టలకు రెండో నెంబర్ ప్రమాద హెచ్చిరికలు జారీ చేసింది విశాఖ తుఫాన్ హెచ్చిరికల కేంద్రం.

Read Also: RBI Data: ప్రభుత్వం పై 1140శాతం పెరిగిన పెన్షన్ భారం..2022-23లో రూ.4.63లక్షల కోట్లు

Exit mobile version