NTV Telugu Site icon

Delhi: పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ అలర్ట్

Rain

Rain

దేశంలోనే పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షపాతం (Heavy Rainfall) నమోదు అవుతుందని.. ఉరుములతో కూడిన వర్షాలు కురవచ్చని వార్నింగ్ (Warnings) ఇచ్చింది. ఈ మేరకు పలు రాష్ట్రాల (Several states) పేర్ల లిస్టును వాతావరణ శాఖ విడుదల చేసింది.

రేపటి నుంచి ఈనెల 22 వరకు దేశంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

ఇక పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాబోయే కొద్ది రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్. జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వడగళ్ల వాన కురిసే ఛాన్సు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాను భారీ వరదలు ముంచెత్తాయి. అతి భారీ వర్షాల కారణంగా ఇళ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. ఈ వరదల్లో ఒక భారతీయురాలు ప్రాణాలు కోల్పోయింది.