Site icon NTV Telugu

Heavy rain: కర్ణాటకలో భారీ వర్షం.. జలమయమైన పలు ప్రాంతాలు

Raeen

Raeen

చాలా రోజులు తర్వాత కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా తాగు నీటితో ప్రజలు సతమతం అవుతున్నారు. బెంగళూరు పట్టణంలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. కనీస అవసరాలకు నీళ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వర్షం కురవడంతో కన్నడియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Kiran Kumar Reddy: మంత్రి పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్‌ సంచలన వ్యాఖ్యలు.. బహిరంగ సవాల్..

గురువారం సాయంత్రం రాష్ట్రంలోని శివమొగ్గ, తీర్థహళ్లి, సాగరలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు గత కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. తీవ్ర వేడిగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వాన కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆశ్వాదించారు. మరోవైపు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షపునీరు భూమిలోకి ఇంకి.. బోరుల్లో నుంచి నీళ్లు అందుకునే అవకాశం ఉంటుంది.

Exit mobile version