NTV Telugu Site icon

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు!

Rains Hyderabad

Rains Hyderabad

Hyderabad Rains News: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. భారీ వర్షంతో నగరంలోని ప్రధాన మార్గాలు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మోకాలిలోతు వరకు నీరు చేరింది. రోడ్లపైకి భారీ నీరు వస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఉప్పల్, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, నాగోల్‌, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్, నాంపల్లి, అమీర్‌పేట, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్‌, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సుచిత్ర, సూరారం, గుండ్ల పోచంపల్లి, జీడిమెట్ల, వనస్థలిపురం, బీఎన్‌ రెడ్డి నగర్, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేటలో కుండపోత వర్షం కురుస్తోంది.

ముషీరాబాద్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాంనగర్‌, పార్సీగుట్ట, బౌద్ధ నగర్‌, గంగపుత్ర కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. వాతావరణశాఖ హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Show comments