Site icon NTV Telugu

Hyderabad Rains : మరో గంటలో హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

Rain In Hyderabad

Rain In Hyderabad

Heavy Rain alert to Hyderabad Today Night.

తెలంగాణను వర్షాలు వీడనంటున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు నిండుకుండలా మారాయి. జలాశయాలకు సైతం వరద నీరు పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని దిగవుకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నేటి రాత్రి హైదరాబాద్‌ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఇప్పటికే హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్ష కురుస్తోంది.

 

కూకట్‌పల్లిలో సాయంత్రం 7 గంటల నుంచి వర్షం భారీ వర్షం కురిసింది. అయితే దీంతో పాటు పలుచోట్ల కురిసిన వర్షాలకు రోడ్లపైకి వర్షపునీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోడ్లపైకి వచ్చిన వర్షపు నీటిని తొలగిస్తున్నారు. మరోపక్క ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు.

 

Exit mobile version