Site icon NTV Telugu

Heavy Rain Alert: అలర్ట్.. తెలంగాణలోని ఆ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ..

Hydrain

Hydrain

Heavy Rain Alert for Telangana: హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలోని పలు జిల్లాలకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రేపు ఉదయం వరకు తెలంగాణలోని పలు జిల్లాలకు అత్యంత భారీ హెచ్చరికలు జారీ అయ్యాయి.. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది.. ఆయా జిల్లాల్లో 20cm వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ మెహబూబాబాద్, వరంగల్ హనుమకొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

READ MORE: Rare Earth Elements: దేశంలో 8.52 మిలియన్ టన్నుల ‘‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’’.. చైనా ఆధిపత్యానికి చెక్..

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తోండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ క్రమంలో అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, కలెక్టర్ దాసరి హరిచందన, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మెట్రో వాటర్ వర్క్స్, ట్రాఫిక్ తదితర అధికారులకి కీలక సూచనలు చేశారు.

READ MORE: Rare Earth Elements: దేశంలో 8.52 మిలియన్ టన్నుల ‘‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’’.. చైనా ఆధిపత్యానికి చెక్..

Exit mobile version