Site icon NTV Telugu

Shamshabad : ఎయిర్ పోర్టులో రూ.8కోట్లు విలువ చేసే బంగారం పట్టివేత

Gold Rate

Gold Rate

Shamshabad : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం‎లో భారీగా బంగారం పట్టుబడింది. అధికారులు ఎంత నిఘా ఏర్పాటు చేసినప్పటికీ గోల్డ్ స్మగ్లింగ్ ఆగడంలేదు. నిత్యం బంగారం అక్రమరవాణా కొనసాగుతూనే ఉంది. అలా తరలిస్తున్న బంగారాన్ని దాదాపు అధికారులు పట్టుకుంటూనే ఉన్నారు. వివిధ దేశాల నుంచి కొందరు ప్రయాణికులు పెద్దమొత్తంలో బంగారాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ విఫలమవుతున్నారు. బంగారాన్ని తీసుకువచ్చేందుకు ప్రయాణికులు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో, షూ, లగేజ్‌ బ్యాగ్‌, కొందరు ఏకంగా కడుపులో బంగారాన్ని దాచుకుని కస్టమ్స్‌ అధికారులకు చిక్కకుండా వెళ్లేందుకు యత్నించారు. కాగా వీరి ప్రయత్నాలను కస్టమ్స్‌ అధికారులు తిప్పికొడుతున్నారు.

Read Also: Akshay Kumar: సాంగ్ లాంచ్ చేస్తూ గిన్నీస్ బుక్ రికార్డ్ క్రియేట్ చేశాడు

తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో రూ.8కోట్లు విలువ చేసే 14.4కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. సూడన్ నుంచి షార్జా వెళ్లే 23 మంది ప్రయాణికుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ 23 మంది ప్రయాణికులు తమ లగేజ్‌లతో పాటు వారు ధరించిన బూట్లలో బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారి పై అనుమానం కలగడం తో వారిని క్షుణ్నంగా పరిశీలించారు కస్టమ్స్ అధికారులు. ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని షూ, పాదాల కింద, బట్టల మధ్య లో దాచి తరలించే యత్నం చేశారు ఆ కిలాడీ లేడీస్. పట్టుకున్న బంగారం విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా. ప్రధానంగా నలుగురు ప్రయాణికులను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు.. బంగారాన్ని ఎక్కడికి చేరవేస్తున్నారనే దానిపై దర్యాప్తు చేపట్టారు.

Read Also: Maternal Mortality: ప్రతీ రెండు నిమిషాలకు ఓ తల్లి మరణిస్తోంది.. యూఎన్ రిపోర్ట్..

Exit mobile version