NTV Telugu Site icon

Ts Police: మొయినాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్..

Ganjay

Ganjay

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులతో పాటు నార్కోటెట్ సిబ్బంది కలిసి సుమారు వంద కిలోల గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మొయినబాద్ మండలం సూరంగల్ గ్రామ రెవెన్యూలో ఉదయం 5 గంటలకు AMR వెంచర్ లో ఉన్న ఒక షెడ్డులో గంజాయినీ స్వాధీనం చేసుకోవడం జరిగింది అని తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలోని రాయఘడ్ నుంచి వయా దూల్ పేట్ మీదుగా సూరంగల్ గ్రామంలో గల ఈ వెంచర్ కి తీసుకు వచ్చారని రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

Read Also: AP Cabinet: రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం.. పెన్షన్‌ రూ.3 వేలకు పెంపు

అయితే, మొదటి 50 ప్యాకెట్లను స్వాధీనం చేసుకోగా అందులో ఒక్కో పాకెట్ రెండు కిలోలు ఉంటుంది అని రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అందులో ఒరిస్సాకి చెందిన బాబర్ ఖాన్, దూల్ పేట్ కి చెందిన నితీష్ సింగ్ ని అరెస్టు చేయగా.. మిగతా ఇద్దరు నిందితులు సునీల్ సింగ్ దూల్ పేట్ వాసి, మనోజ్ ఒరిస్సాకి చెందిన వారు పరారీలో ఉనట్లు పోలీసులు పేర్కొన్నారు.