NTV Telugu Site icon

Telangana Elections : ఎన్నికల్లో ఓటేస్తున్నారా.. వేయకపోతే భారీ జరిమానా, జైలు శిక్ష

New Project (3)

New Project (3)

Telangana Elections : కొన్ని దేశాల్లో ఎన్నికల్లో ఓటు వేయని వారికి జరిమానా విధిస్తారు. మరికొన్ని దేశాల్లో ఏకంగా వారిని నేరస్తులుగా పరిగణించి శిక్షిస్తున్నారు. ఆస్ట్రేలియాలో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఓటు వేయని వారికి దేశ కరెన్సీ ప్రకారం 20 డాలర్లు జరిమానా విధిస్తారు. పేర్కొన్న గడువులోగా చెల్లించకపోతే ఆ జరిమానాను 200డాలర్ల వరకు పెంచుతారు. బెల్జియంలో మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోని వారికి 80 యూరోల వరకు, రెండోసారి ఓటు వేయని వారికి 200 యూరోల వరకు జరిమానా విధిస్తారు. వరుసగా నాలుగుసార్లు ఓటు హక్కు వినియోగించుకోకుంటే పదేళ్లపాటు ఓటరు జాబితా నుంచి వారి పేర్లు తొలగిస్తారు.

Read Also:Telangana Elections 2023: క్యూలో నిల్చొని.. ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్‌!

దీంతోపాటు ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఇవ్వరు. ఓటు వేయని వారికి బ్రెజిల్‌లో జరిమానా కూడా విధిస్తారు. గ్రీస్, ఈజిప్ట్ లలో ఓటు వేయని వారిపై ప్రత్యేక విచారణ చేపడతారు. సరైన కారణం చెబితే వారిని హెచ్చరించి వదిలేస్తారు. కారణం లేకుండా ఓటు వేయకపోతే జైలు శిక్ష విధిస్తారు. ఇటలీలో ఓటు వేయని వాళ్ల పేర్లను అందరికీ తెలిసేలా అధికారిక పత్రాల్లో ప్రచురిస్తారు. పెరూలో దూరంగా ఉన్న వారి డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయబడ్డాయి. ఈ విధంగా ఓటు వేయని వారికి ఒక్కో దేశంలో.. ఒక్కో రకమైన శిక్షలు, ఆంక్షలు ఉంటాయి. ఎలాంటి శిక్షలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్న ఒక్క మన దేశంలో మాత్రమే ఉంది. ఓటును వజ్రాయుధంగా భావించి ప్రతి ఒక్కరం ఓటేద్దాం.

Read Also:Telangana Elections : రెండు కాళ్లు లేకున్నా ఎన్నికల విధుల్లో పెద్దాయన.. హ్యాట్సాఫ్ సారూ !