Site icon NTV Telugu

Heat waves: 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు.. రాబోయే 5 రోజులు జాగ్రత్త..

Weather

Weather

ఉత్తర భారతదేశంలో మండుతున్న ఎండాల దాటికి.. వేడిగాలులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీని నుంచి ఇప్పట్లో ఉపశమనం లభించే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. రాబోయే 5 రోజుల పాటు తూర్పు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలులు కొనసాగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేడి తరంగాల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అలాగే, అధిక తేమ కారణంగా కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Read Also: Allu Arjun: అల్లు అర్జున్ పై కేజీఎఫ్ నటుడు కీలక వ్యాఖ్యలు

కాగా, రాబోయే 3 రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది అని భారత వాతవరణ శాఖ తెలిపింది. ఇవాళ (మంగళవారం) ఢిల్లీలో పగటిపూట బలమైన గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. నేడు దేశరాజధానిలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీల నుంచి 22 డిగ్రీల సెల్సియస్‌లుగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. అయితే, మరో మూడు నాలుగు రోజుల్లో ఢిల్లీలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందన్నారు.

Read Also: Deepthi Sunaina: కొత్త కారు కొన్న దీప్తి సునైన.. కొత్త అనుమానాలు?

అయితే, ఏప్రిల్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలలో నాలుగు నుండి ఎనిమిది రోజుల వరకు వేడి తరంగాలు ఉండే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తం ఏప్రిల్-జూన్ కాలంలో 10 నుంచి 20 రోజుల వరకు వేడి గాలులు వీచే అవకాశం ఉంది చెప్పుకొచ్చింది. మైదాన ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత కనీసం 40 డిగ్రీల సెల్సియస్‌, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీలు, పర్వత ప్రాంతాల్లో 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది వెల్లడించింది. ఇది సాధారణం కంటే కనీసం 4.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ అని పేర్కొనింది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నప్పుడు తీవ్రమైన వేడి తరంగాలు వస్తాయని ప్రకటించింది.

Exit mobile version