Heath Streak Dies: క్యాన్సర్‌తో పోరాడి.. 49 ఏళ్లకే కన్నుమూసిన క్రికెట్ దిగ్గజం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zimbabwe Cricket Legend Heath Streak Died: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. మహమ్మారి క్యాన్సర్‌తో పోరాడి 49 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం క్యాన్సర్‌తో ఇబ్బందులు పడిన హీత్ స్ట్రీక్.. మంగళవారం (ఆగస్టు 22న) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని అతని మాజీ సహచరులు తెలిపారు. జింబాబ్వే క్రికెట్ దిగ్గజం మరణంపై క్రికెటర్లు సంతాపం ప్రకటిస్తున్నారు. హీత్ స్ట్రీక్ జింబాబ్వే తరపున అంతర్జాతీయ క్రికెట్లో 65 టెస్టులు, 189 వన్డేలు ఆడారు.
జింబాబ్వే గొప్ప క్రికెటర్లలో హీత్ స్ట్రీక్ ఒకరు. 2000-2004 మధ్య జట్టుకు నాయకత్వం కూడా వహించారు. హీత్ స్ట్రీక్ తన 12 ఏళ్ల కెరీర్లో 65 టెస్ట్ మ్యాచ్‌లతో సహా 189 వన్డేలు ఆడారు. టెస్ట్ క్రికెట్లో 1,990 పరుగులు, 216 వికెట్స్ తీసిన హీత్ స్ట్రీక్.. వన్డేల్లో 2,943 పరుగులు, 239 వికెట్స్ పడగొట్టారు. జింబాబ్వే తరఫున 100 టెస్టు వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచారు. కెరీర్లో అతను ఒకే ఒక్క సెంచరీ బాదారు. హరారేలో వెస్టిండీస్‌పై టెస్టు క్రికెట్లో సెంచరీ చేశారు.
Also Read
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
Also Read: Astro Tips: ఈ నియమాలతో ఇంట్లో దీపం వెలిగిస్తే.. మీ ఇంటినిండా డబ్బే డబ్బు!
హీత్ స్ట్రీక్ ఆల్‌రౌండర్. అతను తన బౌలింగ్ నైపుణ్యాలతో ఎక్కువగా పేరుగాంచారు. జింబాబ్వే తరపున మిడిల్ ఆర్డర్లో హీత్ స్ట్రీక్ బ్యాటింగ్ చేసేవారు. అంతర్జాతీయ కెరీర్లో అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిచ్‌లపై తన సత్తా చాటారు. జింబాబ్వే ప్రసిద్ధ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరుగాంచారు. అయితే క్రికెట్లో తన ప్రత్యర్థులను భయపెట్టిన హీత్ స్ట్రీక్.. క్యాన్సర్ కారణంగా జీవితంలో మాత్రం గెలవలేకపోయారు.
https://twitter.com/henryolonga/status/1694094487776305536?s=20
https://twitter.com/henryolonga/status/1694094487776305536?s=20
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!