NTV Telugu Site icon

Heath Streak Dies: క్యాన్సర్‌తో పోరాడి.. 49 ఏళ్లకే కన్నుమూసిన క్రికెట్ దిగ్గజం!

Heath Streak

Heath Streak

Zimbabwe Cricket Legend Heath Streak Died: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. మహమ్మారి క్యాన్సర్‌తో పోరాడి 49 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం క్యాన్సర్‌తో ఇబ్బందులు పడిన హీత్ స్ట్రీక్.. మంగళవారం (ఆగస్టు 22న) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని అతని మాజీ సహచరులు తెలిపారు. జింబాబ్వే క్రికెట్ దిగ్గజం మరణంపై క్రికెటర్లు సంతాపం ప్రకటిస్తున్నారు. హీత్ స్ట్రీక్ జింబాబ్వే తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో 65 టెస్టులు, 189 వన్డేలు ఆడారు.

జింబాబ్వే గొప్ప క్రికెటర్లలో హీత్ స్ట్రీక్ ఒకరు. 2000-2004 మధ్య జట్టుకు నాయకత్వం కూడా వహించారు. హీత్ స్ట్రీక్ తన 12 ఏళ్ల కెరీర్‌లో 65 టెస్ట్ మ్యాచ్‌లతో సహా 189 వన్డేలు ఆడారు. టెస్ట్ క్రికెట్‌లో 1,990 పరుగులు, 216 వికెట్స్ తీసిన హీత్ స్ట్రీక్.. వన్డేల్లో 2,943 పరుగులు, 239 వికెట్స్ పడగొట్టారు. జింబాబ్వే తరఫున 100 టెస్టు వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచారు. కెరీర్‌లో అతను ఒకే ఒక్క సెంచరీ బాదారు. హరారేలో వెస్టిండీస్‌పై టెస్టు క్రికెట్‌లో సెంచరీ చేశారు.

Also Read: Astro Tips: ఈ నియమాలతో ఇంట్లో దీపం వెలిగిస్తే.. మీ ఇంటినిండా డబ్బే డబ్బు!

హీత్ స్ట్రీక్ ఆల్‌రౌండర్‌. అతను తన బౌలింగ్ నైపుణ్యాలతో ఎక్కువగా పేరుగాంచారు. జింబాబ్వే తరపున మిడిల్ ఆర్డర్‌లో హీత్ స్ట్రీక్ బ్యాటింగ్ చేసేవారు. అంతర్జాతీయ కెరీర్‌లో అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిచ్‌లపై తన సత్తా చాటారు. జింబాబ్వే ప్రసిద్ధ ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరుగాంచారు. అయితే క్రికెట్‌లో తన ప్రత్యర్థులను భయపెట్టిన హీత్ స్ట్రీక్.. క్యాన్సర్ కారణంగా జీవితంలో మాత్రం గెలవలేకపోయారు.

Show comments