వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా వాహనం ఢీకొని చీలి సింగయ్య మృతి చెందిన కేసులో జగన్ రెండో నిందితుడిగా ఉన్నారు. తనపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం హైకోర్టు క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.
ఈ కేసులో వైఎస్ జగన్ పిటిషన్‌తో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వరరెడ్డి (ఏ3), ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (ఏ4).. మాజీ మంత్రులు పేర్ని నాని (ఏ5), విడదల రజిని (ఏ6)ల క్వాష్ పిటిషన్లపై కూడా న్యాయస్థానం విచారణ చేయనుంది. సింగయ్య భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. జగన్ కాన్వాయ్‌లోని గుర్తుతెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ మొదట ప్రకటన విడుదల చేశారు.
Also Read: Akhanda Godavari Project: నేడు ‘అఖండ గోదావరి’ ప్రాజెక్ట్‌కు శంఖుస్థాపన!
ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెంగుళూరుకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగుళూరుకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 2:40 గంటలకు బెంగుళూరులోని నివాసానికి జగన్ చేరుకోనున్నారు.
