వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లంచ్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. శాసనసభ సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మండలి ఛైర్మన్ జారీ చేసిన నోటీసులను ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. వీటిపై సోమవారం వాదనలు కొనసాగాయి.
Read Also: Delhi: అన్నదాతలకు కేంద్రం శుభవార్త.. ఇక నుంచి రూ.9వేలు..!
ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమపై స్పీకర్ ఏ సమయంలోనైనా అనర్హత వేటు వేసే అవకాశం ఉందని రెబెల్ ఎమ్మెల్యేలు తెలిపారు. స్పీకర్ తమపై అనర్హత వేటు వేసే చర్యలకు తీసుకునే ప్రొసీడింగ్స్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఎమెల్యేలు కోరారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఏపీ హైకోర్టు పేర్కొంది. కాగా.. తదుపరి విచారణ వచ్చే నెల 26కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
Read Also: CM Review: రేపు ఆర్ధిక శాఖపై సీఎం జగన్ సమీక్ష..