AP DSC Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, అడ్వకేట్ జనరల్ అభ్యర్థనతో విచారణ వాయిదా వేసింది హైకోర్టు.. హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ముందు.. ఈ రోజు డీఎస్సీ నోటిఫికేషన్‌పై విచారణ సాగింది.. పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.. ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని న్యాయమూర్తులు ముందు వాదనలు వినిపించారు.. దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు ఎన్సీటీఈ నిబంధనలుకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని ఆరోపించారు.. అయితే, ప్రభుత్వ వివరణ తీసుకోవడానికి సమయం కావాలని ఏజీ.. హైకోర్టును అభ్యర్థించారు.. అడ్వకేట్ జనరల్ అభ్యర్థన మేరకు విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.
Read Also: TS EAPCET 2024: తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల తేదీ వచ్చేసింది..