Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Healthy Sugar Free Ice Cream Recipe At Home With Dry Fruits And Oats

Sugar-Free Ice Cream Recipe: చక్కెర లేకుండా హెల్తీ ఐస్‌క్రీమ్ చేసేయండి ఇలా.. పిల్లల నుంచి పెద్దల వరకు పోటీపడి తినేస్తారంతే!

Published Date :February 6, 2026 , 7:05 pm
By Kothuru Ram Kumar
Sugar-Free Ice Cream Recipe: చక్కెర లేకుండా హెల్తీ ఐస్‌క్రీమ్ చేసేయండి ఇలా.. పిల్లల నుంచి పెద్దల వరకు పోటీపడి తినేస్తారంతే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sugar-Free Ice Cream Recipe: పిల్లలకు, అలాగే కొంతమంది పెద్దలకు ఐస్‌క్రీమ్ అంటే చాలా ఇష్టం. అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది తల్లిదండ్రులు వాటిని పిల్లలు ఇవ్వడానికి సంకోచిస్తారు. కానీ ఇప్పుడు చక్కెర, క్రీమ్, కండెన్స్‌డ్ మిల్క్, మిల్క్ పౌడర్ లేదా ఫ్లోర్ లేకుండానే ఇంట్లో హెల్తీ ఐస్‌క్రీమ్ తయారు చేయడం సాధ్యమే. ఈ ఐస్‌ క్రీమ్‌ ను డయాబెటిస్ ఉన్నవారు కూడా పరిమితంగా ఎలాంటి మొహమాటం లేకుండా తినవచ్చు. మరి దీనిని ఎలా చేయాలో చూసేద్దామా..

Creamy & Tasty: పుట్టగొడుగులతో అదిరిపోయే పాస్తా రెసిపీ.. పిల్లలు అడిగి మరీ తింటారు.!

అవసరమైన పదార్థాలు:

* జీడిపప్పు – 100 గ్రాములు

* బాదం – 200 గ్రాములు

* రోల్డ్ ఓట్స్ – ¼ కప్పు

* ఖర్జూరాలు – 10 నుంచి 15

* పాలు – 1½ కప్పులు (వేర్వేరు దశల్లో)

* కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు

* వెనీలా ఎసెన్స్ – ½ టీ స్పూన్

* డార్క్ చాక్లెట్ – ¼ కప్పు (ఐచ్చికం)

* తేనె– అవసరమైతే

* టాపింగ్ కోసం ఆల్మండ్స్ లేదా చాకో చిప్స్ లేదా జీడిపప్పు ముక్కలు

తయారీ విధానం:
మొదట ఒక బౌల్‌లో జీడిపప్పు, బాదం వేసి నీళ్లలో నానబెట్టాలి. బాదం తొక్క సులభంగా తీసేందుకు గోరువెచ్చని నీళ్లు ఉపయోగిస్తే మంచిది. ఆ తర్వాత పాన్‌లో రోల్డ్ ఓట్స్‌ను తక్కువ మంటపై 3 నిమిషాలు సన్నని మంటపై వేయించాలి. వీటిలో గింజలు తీసిన ఖర్జూరాలు, ఒక కప్పు గోరువెచ్చని పాలు వేసి ఒకటి నుంచి రెండు గంటలు నానబెట్టాలి.

బడ్జెట్ సెగ్మెంట్‌లో సంచలనం.. 10000mAh బ్యాటరీతో వస్తున్న Honor X80.!

ఇప్పుడు మిక్సీ జార్‌ లో తొక్క తీసి శుభ్రంగా కడిగిన బాదం, నానిన ఓట్స్, ఖర్జూరాలు, జీడిపప్పు, కోకో పౌడర్, వెనీలా ఎసెన్స్, అర కప్పు పాలు వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌ లో వేసి.. అవసరమైతే డార్క్ చాక్లెట్ జోడించి సన్నని మంటలో 5 నిమిషాలు క్రీమీగా అయ్యే వరకు కలుపుతూ కుక్ చేయాలి. ఆ తర్వాత పూర్తిగా దానిని చల్లారనివ్వాలి.

చల్లారిన తర్వాత మళ్లీ మిక్సీలో వేసి ఫైన్‌గా బ్లెండ్ చేయాలి. స్వీట్‌ నెస్ తక్కువగా అనిపిస్తే కొద్దిగా హనీ జోడించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఎయిర్‌ టైట్ కంటైనర్‌ లో వేసి, పైభాగాన్ని బటర్ పేపర్ తో కవర్ చేసి ఫ్రీజర్‌ లో కనీసం 8 గంటలు లేదా ఓవర్‌నైట్ ఫ్రీజ్ చేయాలి. అంతే చెక్కర్లేని స్మూత్ ఐస్ క్రీం రెడీ. ఫ్రీజర్ నుంచి తీసిన తర్వాత రోస్టెడ్ ఆల్మండ్స్, చాకో చిప్స్ లేదా గ్రేటెడ్ డార్క్ చాక్లెట్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. దానితో అది మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా తయారైన ఐస్‌క్రీమ్ క్రీమీగా, నేచురల్ స్వీట్‌నెస్‌తో చాలా టేస్టీగా ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • dates ice cream recipe
  • diabetic friendly dessert
  • dry fruits ice cream
  • healthy ice cream at home
  • homemade healthy ice cream

తాజావార్తలు

  • Gold Rates: హమ్మయ్య.. మగువలకు పండగే పండగ.. దిగొచ్చిన బంగారం ధరలు

  • Bangladesh Cricket: భారత్‌తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..

  • Anganwadi Teacher: అమానుష ఘటన.. అంగన్‌వాడీ టీచర్‌ ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. కారణం ఇదే

  • Vishwambhara Release Date : రాదనుకున్న ‘విశ్వంభర’ రిలీజ్ అవుతోంది..

  • Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. మరోసారి ఉద్రిక్తతలు తప్పవా!?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions