Jowar Halwa Recipe: ఎవరికైనా సరే ఇదొక సమయంలో స్వీట్ తినాలన్పించడం కామన్. అయితే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తక్కువ సమయంలో తయారు చేసుకునే వంటకాల్లో ‘జొన్నపిండి హల్వా’ బెస్ట్ అప్షన్. ఇది కేవలం రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి చలువనిచ్చే ఈ హల్వా కుటుంబ సభ్యులందరికీ నచ్చేలా ఉంటుంది. మరి ఈ ‘జొన్నపిండి హల్వా’ను ఎలా చేసేయాలి చూసేద్దామా..
Stock Market: యుద్ధ భయం.. భారీ నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు
మొదటగా ఒక గిన్నెలో ఒక గ్లాసు బెల్లం తీసుకుని అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ తరువాత స్టవ్‌పై పెట్టి బెల్లం పూర్తిగా కరిగే వరకు వేడి చేయాలి. బెల్లం కరిగిన తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు మరో మందమైన పాన్ తీసుకుని స్టవ్‌పై పెట్టాలి. అందులో అర గ్లాసు నెయ్యి వేసి వేడి అయ్యాక, ముందుగా జల్లించిన ఒక గ్లాసు జొన్నపిండిని అందులో వేయాలి. మంటను లో నుంచి మీడియం స్థాయిలో ఉంచి, జొన్నపిండిని నిరంతరం కలుపుతూ నెమ్మదిగా వేయించాలి. పిండి రంగు మారకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి.
జొన్నపిండి బాగా వేగిన తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం నీటిని కొద్దికొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం గట్టిపడి పాన్ కు అంటకుండా విడిపోవడం ప్రారంభమయ్యే వరకు ఉడికించాలి. చివరిగా అర స్పూన్ యాలకుల పొడి, కాస్త నెయ్యి వేసి బాగా కలపాలి. తరువాత మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంతే ఆరోగ్యకరమైన, రుచికరమైన ‘జొన్నపిండి హల్వా’ సిద్ధం.
