NTV Telugu Site icon

Health Tips : పరగడుపున తులసి నీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Basil Ayurveda

Basil Ayurveda

పూజలో తులసి ఉండాల్సిందే.. హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అంత పవిత్రమైన తులసిని ఆయుర్వేధంలో కూడా వాడుతున్నారు.. ఎన్నో రోగాలను కూడా నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.. తులసి నీళ్లను పరగడుపున తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

తులసి కషాయం పరగడుపున తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి కషాయం ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుందిం.. అంతేకాదు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్లు వెంటనే కరిగిపోతాయి. అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.. ఈ కాలంలో జలుబు, దగ్గు వంటివి ఎక్కువగా బాదిస్తూ ఉంటాయి.. ఒక స్పూన్ తేనె రసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అంతేకాదు దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రిస్తుంది. కాలేయం శక్తివంతంగా పనిచేయడానికి దోహదపడుతుంది. నోటి నుండి దుర్వాసన వెలువడకుండా నిషేధిస్తుంది. అలర్జీలు, పొగ ,దుమ్ము నుండి శరీరానికి కలిగే హానిని అరికడుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. దాదాపు అందరూ ఇళ్లలోనూ ప్రధాన ద్వారానికి ఎదురుగా తులసి మొక్క ఉంటుంది… అలా ఉంచడం వల్ల ఇంట్లోకి ఎటువంటి వైరస్ ప్రవేశించదు.. చర్మ, దంత సమస్యలను కూడా నయం చేస్తుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.