Site icon NTV Telugu

Health Tips: రక్తహీనతా? అయితే గుమ్మడి జ్యూస్ చాలు.. ఎలా చేసుకోవాలంటే?

Pump

Pump

Improve Blood Percentage in Body: ఈ మధ్య చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్త హీనత. మనం బిజీ లైఫ్ లో పడి మన తీసుకునే ఫుడ్ మీద సరిగా శ్రద్ధ చూపడం లేదు. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య రక్త హీనత. చూడటానికి బలంగా ఉన్నట్లు కనిసిస్తున్న ఎప్పుడూ నీరసంగా, ఓపిక లేనట్లు కనిపిస్తూ ఉంటారు కొందరు. దానికి ప్రధాన కారణం రక్తం తగిన మోతాదులో లేకపోవడమే. అయితే రక్తం శాతాన్ని పెంచుకోవడం కోసం ఏవేవోటాబ్లెట్లు వాడుతూ ఉంటారు కొంతమంది. అయితే దీని వల్ల లేనిపోని రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే సహజసిద్దంగా కూడా మనం రక్తాన్ని పెంచుకోవచ్చు.

Also Read: Health Tips: రక్తహీనతా? అయితే గుమ్మడి జ్యూస్ చాలు.. ఎలా చేసుకోవాలంటే?

రక్తాన్ని పెంచుకోవడానికి గుమ్మడి రసం మంచి ఔషధంలా పనిచేస్తోంది. దీని వల్ల వారం రోజుల్లోనే మన శరీరంలో రక్తం శాతం పెరుగుతుంది. గుమ్మడి జ్యూస్ చేసుకోవడం కోసం ముందుగా  గుమ్మడి కాయ గుజ్జు తీసి దానిని దళసరి గుడ్డలో వేసి బాగా పిండితే వచ్చే రసాన్ని కప్పులో పోసుకుని తాగాలి. ఇలా రోజుకు ఒక కప్పు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక కిస్మిస్ ను నానా బెట్టి తిన్నా కూడా నెల రోజుల్లో రక్తం పట్టేస్తుంది. వీటితో పాటు రక్తం త్వరగా శరీరానికి పట్టాలంటే క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ మంచి ఉపాయం. ఇవి తీసుకుంటే మనకి వారంలోనే బ్లడ్ పట్టేస్తుంది. మంచి రిజల్ట్స్  వస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. ఇక లేత కొబ్బరి, ఖర్జూర తీసుకుంటే కూడా రక్తం పుష్కలంగా లభిస్తుంది. ఎండు ఖర్జూరాన్ని రాత్రి పూట నానబెటి తెల్లవారగానే ఆ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్త హీనతతో బాధపడుతూ శరీరంలో రక్తం శాతాన్ని పెంచుకోవాలనుకునే వారు టాబ్లెట్స్ జోలికి పోకుండా సహజంగానే ప్రయత్నిస్తే మంచిది.

 

Exit mobile version