వేడితో సతమతున్న జనాలకు తొలకరి చినుకులు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి…వర్షపు చినుకులు మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. అయితే, ఈ కాలంలో అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు, వ్యాధులు ఎక్కువగానే ఇబ్బందిపెడుతూ ఉంటాయి. వర్షాకాలంలోపుప్పొడి, ధూళి, కారణంగా అర్జీలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి..ఆస్తమా, సైనస్ సమస్యలు ఉన్నవారి పరిస్థితి తీవ్రం అవుతుంది. తేమ వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్ కూడా త్వరగా వృద్ధి చెందుతాయి. ఈ సీజన్‌లో అలెర్జీలు, వ్యాధికారక క్రిముల నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవడం చాలా ముఖ్యం.. అందుకోసం మీరు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పుల్లని పండ్లు :
సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. మీ డైట్ ఆరెంజ్, నిమ్మ, బత్తాయి, యాపిల్ వంటి పండ్లు చేర్చుకుంటే.. విటమిన్ సి సమృద్ధిగా అందుతుంది…
అల్లం :
అల్లం అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుంది అనడంలో ఎటువంటి సదేహం లేదు..రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. నాసికా మార్గం, గొంతులో చికాకు కలిగించే.. అలెర్జీలతో బాధపడుతుంటే.. అల్లం ఎంతగానో సహాయపడుతుంది. అల్లంలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ యాంటీఆక్సిడేటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. అలెర్జీ లక్షణాలను తగ్గిస్తాయి.. సీజనల్ వ్యాధులను నయం చెయ్యడంలో కూడా ఇది సాయపడుతుంది..
ఉల్లిపాయలు :
ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే బయోఫ్లేవనాయిడ్ ఉంటుంది, ఇది యాంటిహిస్టామైన్‌గా పనిచేస్తుంది. మీరు అలెర్జీలతో బాధపడుతుంటే.. యాంటిహిస్టామైన్లు సహాయపడతాయి. దీనిలో యాంటీఆక్సిడేటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఉల్లిపాయలో ప్రీబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..
టొమాటాలు:
టొమాటోలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, వీటిలో లైకోపీన్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో వాపులను నివారించడానికి అరెర్జీలను కూడా తగ్గిస్తాయి.. ఎన్నో రోగాలాను నయం చేస్తాయి..
పసుపు :
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ వంటి వివిధ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పసుపులోని కర్కుమిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు పాలలో పసుపు వేసుకుని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.. ఇంకా ఎన్నో సమస్యలు నయం అవుతాయి.. వీటన్నిటిని వర్షాకాలం తప్పక తీసుకోవాలి..