NTV Telugu Site icon

Health Tips : థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టాలంటే వీటిని తప్పక తీసుకోవాలి..

Thyroid.

Thyroid.

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వయస్సుతో సంబంధం లేకుండా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..థైరాయిడ్ అనేది ఒక గ్రంథి. ఇది శరీర పెరుగుదలలో, జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి రుగ్మతల కారణంగా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం లేదా పెరగడం. హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే పరిస్థితి. థైరాయిడ్ ఉన్నవారు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం..

ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయను థైరాయిడ్ రోగులు క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. ఇది వారి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే అంటువ్యాధులు, ఇతర రోగాల ముప్పును తగ్గిస్తుంది.
గుమ్మడికాయ విత్తనాలు జింక్ కు గొప్ప మూలం. ఇది శరీరంలోని ఇతర విటమిన్లు, ఖనిజాల శోషణకు సహాయపడుతుంది. అలాగే శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణ, సమతుల్యతకు దోహదం చేస్తుంది. అందుకే గుమ్మడి గింజలను థైరాయిడ్ రోగులు తప్పకుండా తినాలి.

గ్రీన్ టీ..థైరాయిడ్ రోగులకు గ్రీన్ టీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది..

దానిమ్మ పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ పండ్లు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు దానిమ్మ పండ్లు మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. శృంగార సామార్థ్యన్ని కూడా పెంచుతుంది..

పెరుగు మంచి పోషకాల బాంఢాగారం. అయోడిన్ పుష్కలంగా ఉండే పెరుగు థైరాయిడ్ ఆరోగ్యానికే కాదు పొట్ట ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పెరుగు ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది.. అలాగే గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.. ఇవే కాక చాలానే ఉన్నాయి.. సమస్య ఎక్కువగా ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి..