Health Tips : చలికాలంలో అంజీరాలను ఇలా తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోషకాలు ఎక్కువగా ఉండే అంజీరాలు చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వీటిని పచ్చి వాటిని తీసుకోవచ్చు.. అలాగే డ్రై ప్రూట్ గా కూడా తీసుకోవచ్చు.. అందుకే వీటిని రోజు ఒకటి చొప్పున తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఈ చలికాలంలో రోజూ ఉదయాన్నే నానబెట్టిన అత్తి పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లు మన శరీరాన్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి.. వీటిని తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు తరచుగా వస్తుంటాయి. చలికాలంలో మనల్ని మనం రక్షించుకోవడానికి మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను ఖచ్చితంగా తినాలి..అందులో అంజీరాలను తీసుకుంటే ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు.. రాత్రిపూట ఒక కప్పు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వీటిని తింటే మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అదుతాయి. వీటిని ఇతర డ్రై ఫ్రూట్స్ తో పాటుగా కూడా తినొచ్చు.. వీటిని ఎలా తీసుకున్నా మంచిదే..
Also Read
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
అంజీరాలో ముఖ్యంగా విటమిన్ ఎ పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.. నానబెట్టి తీసుకుంటే.. మన చర్మానికి తగినంత పోషణ అందుతుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వీటిని తినొచ్చు.. ఎముకల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వీటిలో కాల్షియం, ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి.. అలాగే అధిక రక్తపోటును నియంత్రించడానికి పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇది అత్తిపండ్లలో పుష్కలంగా ఉంటుంది.. మలబద్ధకం సమస్యతో బాధపడుతన్న వారికి అంజీర పండ్లు మెడిసిన్ లాగే పనిచేస్తాయి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. ఇంకా ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.. రోజు నానబెట్టిన రెండు పండ్లను తీసుకోవడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!