మనిషికి మంచి ఆహారం సుఖమాయమైన నిద్ర తప్పనిసరి.. లేకుంటే మాత్రం ఎన్ని సమస్యలు వస్తాయో ఊహించడం కష్టం అంటున్నారు నిపుణులు.. రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయ్యే వాళ్ళు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు అంటున్నారు..వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో మనిషి జీవితకాలం చాలా తక్కువగా మారింది. నిద్రపోయే సమయం కూడా దీనికి కారణమని చాలా మందికి తెలియదు.. కానీ ఇది నమ్మలేని నిజం..ఆలస్యంగా నిద్రించే వారు అనారోగ్య అలవాట్ల వల్ల ముందుగానే చనిపోతారని అధ్యయనం చెబుతోంది. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు అనారోగ్యకరమైన అలవాట్లను పెంచుకునే అవకాశం ఉంది..
రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయేవారు పొగాకు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్ర వ్యవధి, నాణ్యత, రాత్రి షిఫ్ట్ పని ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు..ఆలస్యంగా నిద్రపోయేవారు త్వరగా నిద్రపోయేవారి కంటే ఎక్కువగా మద్యం, పొగ తాగుతుంటారు. హెల్సింకి విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన ప్రకారం, మానవ శరీరం ఒక నిర్దిష్ట సమయంలో నిద్రపోయే సహజ ధోరణిని కలిగి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదు. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు..
ఇకపోతే నిద్ర వ్యవధి, రాత్రి షిఫ్ట్ పని మానవ శరీరంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని చాలా ఆధారాలు ఉన్నాయి. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. దీని ద్వారా తెలిసింది ఏమిటంటే.. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల చనిపోయే అవకాశం కూడా పెరిగినట్లు తెలుస్తుంది.. అందుకే 8 కల్లా తినడం, ఉదయం ఆరు గంటలకు లేవడం అలవాటు చేసుకోవడం మంచిది.. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది..
