NTV Telugu Site icon

Health Tips : పాలల్లో ఈ రెండు కలిపి తాగితే చాలు.. ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలో..

Milk

Milk

పాలు ఆరోగ్యానికి చాలా మంచివి.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అందుకే రోజూ ఒక గ్లాస్ పాలు తాగమని డాక్టర్లు సిపారస్ చేస్తున్నారు.. పాలను తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎముకలను ధృడంగా ఉంచడంలో, దంతాలను గట్టిగా చేయడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇలా అనేక రకాలుగా పాలు మనకు దోహదపడతాయి. అయితే ఇలా సాధారణ పాలను తాగడానికి బదులుగా పాలల్లో ఇప్పుడు చెప్పే పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అయితే పాలల్లో వీటిని కలుపుకొని తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలను తాగడానికి బదులుగా పాలల్లో శొంఠి, యాలకులు కలిపి తీసుకోవడం వల్ల మరింత మేలు కలుగుతుంది. ఇలా పాలల్లో శొంఠి, యాలకులు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వెంటనే తగ్గుతాయి.. రక్తంలో చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ అదుపులో ఉంటాయి. అలాగే అధిక రక్తపోటుతో బాధపడే వారు కూడా ఇలా శొంఠి, యాలకులు కలిపిన పాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. నీరసం, బలహీనతలు వంటివి దూరం అవుతాయి.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు, వాతావరణం మార్పుల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. దగ్గు, గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.. ఇంకా ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి..

ఈ పాలను ఎలా తీసుకోవాలంటే.. ఈ పాలను తయారు చేసుకోవడం చాలా సులభం. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో ఒక టీ స్పూన్ శొంఠి పొడి, ఒకటిన్నర టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.. ముఖ్యంగా చలికాలంలో వచ్చే వ్యాధులను వెంటనే తగ్గిస్తుంది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.