NTV Telugu Site icon

Health Tip: మిరియాలతో దీన్ని కలిపి తీసుకుంటే కంటి చూపు పెరుగుతుంది..

Pepper

Pepper

ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కంటి సమస్యలతో బాధపడుతున్నారు.. కంటి చూపు సరిగ్గా ఉండడం లేదు. అలాగే ఇతర కంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే కంటి చూపును పెంచడంతో పాటు కంటి సమస్యలను తగ్గించడం కోసం ఒక మిశ్రమం బాగా పనిచేస్తుంది. కంటి చూపును పెంచే మందులు మన వంట గదిలోనే ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పూర్వ కాలంలో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్లే కంటి చూపు బాగుందట.. ఇప్పుడు ఆ వంటింటి చిట్కా గురించి తెలుసుకుందాం..

కంటి చూపును పెంచేందుకు నెయ్యి, మిరియాల పొడి మిశ్రమం ఎంతగానో పనిచేస్తుంది. నెయ్యిలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను పోగొడుతుంది. అలాగే నెయ్యి లో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కాలంగా ఉన్నాయి.. అందుకే కళ్ళకు సంబందించిన సమస్యలు తొలగి పోతాయి.. ఈ రెండింటిని కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసి రోజూ తీసుకోవాలి. ఒక టీస్పూన్ నెయ్యిలో పావు టీస్పూన్ మిరియాల పొడిని వేసి కలిపి ఆ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే పరగడుపునే సేవించాలి. తరువాత 30 నిమిషాల వరకు ఎలాంటి ఆహారాలు, ద్రవాలు తీసుకోరాదు.

ఇలా చేస్తుంటే నెల రోజుల్లో చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది. దీంతో కంటి చూపు పెరుగుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి.. కళ్లజోడు వాడేవారికి వీటితో పని ఉండదు.. నెయ్యి, మిరియాల పొడి రెండూ వేడి చేసే పదార్థాలు… అందుకే ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నవాళ్లు వీటిని తీసుకోక పోవడమే మంచిది.. ఇతరులు ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు. దీంతో కంటి చూపు మెరుగు పడడంతో పాటు కంటి సమస్యలు తగ్గుతాయి.. అలాగే అధిక బరువు, జీర్ణ సంబంధిత సమస్యల తో పాటు ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చెయ్యండి.. వీటితో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.