Site icon NTV Telugu

Netherlands Health Team Visit NIMS: తెలంగాణలో ఆరోగ్య సేవలు భేష్.. నెదర్లాండ్స్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రశంసలు

Nims

Nims

నిమ్స్ ఆసుపత్రిని నెదర్లాండ్స్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జాన్ కైపర్స్, ప్రతినిధుల బృందం సందర్శించింది. నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్, క్యాన్సర్, యూరాలజీ విభాగాలను జాన్ కైపర్స్ బృందం పరిశీలించింది. నిమ్స్ ఆస్పత్రిలో అందిస్తున్న చికిత్సలను అధ్యయనం చేసేందుకు ఈ టీమ్ వచ్చింది. నెదర్లాండ్స్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ మినిస్టట్ జాన్ కైపెర్స్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి రావడం చాలా సంతోషంగా ఉంది.. తెలంగాణలో నిమ్స్ ఆస్పత్రి ప్రతిష్ట గురించి అనేక విషయాలు విన్నాను.. స్వయంగా చూసేందుకు నిమ్స్ కి వచ్చాను.. ఇక్కడ వివిధ విభాగాల పనితీరు గురించి అధ్యయనం చేసేందుకు ఈ హస్పటల్ కు వచ్చాను.. తెలంగాణలో వైద్య సేవలు బాగున్నాయి.. అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు బాగున్నాయని అని జాన్ కైపర్స్ ప్రశంసించారు.

Read Also: Syed Sohel: మా అమ్మ కూడా ట్రోల్ చేసింది.. కానీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకుంది!

ప్రజా ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని నెదర్లాండ్స్ వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి జాన్ కైపర్స్ తెలిపాడు. ప్రజలకు మెరుగైన చికిత్సతో పాటు అత్యవసర పరిస్థిత్తుల్లో ఎలా ట్రీట్మెంట్ అందించాలనే దానిపై డాక్టర్లు తెలిపిన విధానం చాలా బాగుంది అని ఆయన పేర్కొన్నారు. నిమ్స్ ఆస్పపత్రిలో డయాలసిస్, క్యాన్సర్, యూరాలజీ విభాగాలకు వచ్చే పేషెంట్స్ కు మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాందుకు తెలంగాణ ప్రభుత్వానికి గుడ్ లక్ అని నెదర్లాండ్స్ హెల్త్ మినిష్టర్ జాన్ కైపర్స్ చెప్పాడు. ఇక, నెదర్లాండ్స్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జాన్ కైపర్స్, ప్రతినిధుల బృందానికి నిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం స్వాగతం పలికింది.

Read Also: Rajasthan: రాజస్థాన్ ఎన్నికల నిర్వహణ, మేనిఫెస్టో కమిటీలో లేని సీనియర్ నేత పేరు

Exit mobile version