NTV Telugu Site icon

Twin Banana: జంట అరటిపండ్లను తింటే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు..!

Twin Banana

Twin Banana

Twin Banana: అరటిపండును ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు.. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.. అందుకే ఈ తియ్యని అరటిపండును వయస్సుతో సంబంధం లేకుండా అందరు తింటారు.. ఇక అరటిపండ్లు కూడా ఏడాది పొడవున కాస్తాయి.. ఆరోగ్య పరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. అరటిపండ్లను మనం ఎప్పుడైనా కొనుగోలు చేసినప్పుడు కొన్ని కొన్ని సార్లు జంట అరటి పండ్లు కూడా మనకు వస్తూ ఉంటాయి. అంటే ఒక అరటిపండుకి మరొక అటు అరటిపండు అతుక్కొని ఉంటుంది. దానినే జంట అరటి పండ్లు అని కూడా అంటారు..

Read Also:Mutual Fund: రికార్డు సృష్టించిన ఎస్ఐపి పెట్టుబడి.. మొదటిసారిగా రూ. 15,000 కోట్లు.. 33.06లక్షల కొత్త ఖాతాలు

ఈ అరటిపండ్లను తినడం వల్ల కవల పిల్లలు పుడతారని అపోహ అందరిలోనూ ఉంటుంది..ఆ జంట అరటిపండ్లను తినవచ్చా తినకూడదా అన్న అనుమానం చాలా మందికి కలుగుతూ ఉంటుంది. ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒకదానితో మరొకటి అతుక్కుపోయి వున్న కవల అరటిపళ్ళుగానీ ఉన్నాయా అని చూస్తాం. ఒకవేళ వుంటే ఆ కవల పండు వద్దని చెప్పి తీయించేస్తాం. కారణం? కవల అరటిపళ్ళను పిల్లలు తినకూడదు. పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారు. కవల అరటి పళ్ళను దేవుడికి పెట్టకూడదు.. ఎందుకు పెట్టకూడదో అనే దానికి పెద్ద చరిత్రే ఉందని నిపుణులు అంటున్నారు..

Read Also:Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. సెప్టెంబర్లో ఈ రేంజ్ ధరలు ఉండొచ్చు

మార్కెట్ లో కొన్న అరటిపళ్ళలో మనకి తెలియకుండానే కవల అరటిపళ్ళు వచ్చేస్తూ వుంటాయి. వాటిని పిల్లలకి పెట్టకుండా, దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ ఉంటార. ఇంతకీ, కవల అరటిపళ్ళను పిల్లలకు పెట్టడం సంగతి అలా వుంచితే, కవల అరటిపళ్ళను దేవతలకు పెట్టకూడదా? అంటే.. అరటి చెట్టు అంటే మరెవరో కాదు. సాక్షాత్తూ దేవనర్తకి రంభ అవతారమే. శ్రీమహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకార పూరితంగా విర్రవిగూతుంటే ఆమెను భూలోకంలో అరటి చెట్టుగా మార్చేశారు.. దేవతలకు నైవేద్యంగా ఉండమని చెబుతారు. దేవుడికి ఈ అరటిపండు ను పెట్టడం వల్ల తప్పులేదు.. ఇకపోతే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకూడదు. ఎందుకంటే కవల అరటిపండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండుకిందే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక్కపండు పెట్టకూడదు. అలాగని రెండు కవల అరటిపళ్లు తాంబూలంలో పెట్టామంటే చూడటానికి బాగోదు అందువల్ల తాంబూలంలో పెట్టక పోవడమే మంచిది..