Terrible Video : మామూలుగా చాలామంది ఎదుటి వారి కింద బతకేందుకు ఇష్టపడదు. ఎన్ని కష్టాలైనా ఎదురీది బతకాలన్న పౌరుషంతో ఉంటారు. అలాగే చచ్చేముందు కూడా పౌరుషంగానే పోవాలని అనుకుంటారు. ఇలా మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Farmers: రైతులకు గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.10 వేలు పంపిణీ డేట్ ఫిక్స్!
సాధారణంగా పాములు అవి ఉన్న పరిసరాల్లో అలజడి కలిగితే వెంటనే పారిపోతాయి. తమపై దాడి జరుగుతుందని అనిపిస్తే ఆత్మరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తాయి. తన శత్రువు పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. ఒక పాము తనను తాను కాటేసుకోవడం ఎప్పుడైనా చూశారా? అది కూడా తన తలను నరికిన తర్వాత కసిగా కరుచుకోవడం అంటే నమ్మట్లేదు కదూ. ఈ భయానక దృశ్యాలతో కూడిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒక తల తెగిపడిన పాలు తనను తాను కరుచుకోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
Read Also: Ayesha Meera Case: ఆయేషా మీరా కేసులో సత్యంబాబు కీలక వ్యాఖ్యలు..
ఈ వీడియోను ఆడ్లీ టెర్రిఫైయింగ్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో 15 సెకన్ల పాటు ఉంది. ఈ దృశ్యాల్లో ఓ విషసర్పం తల తెగిపోయి ఉంది. అయినా ప్రాణాలు పోకపోవడంతో ఆ పాము శరీరం కదులుతూ కనిపించింది. ఈ క్రమంలో పాము దేహం వచ్చి తెగిపోయి పక్కన పడివున్న తలకు తగిలింది. అంతే ఒక్కసారిగా ఆ తల నోరు తెరచి తన దేహాన్ని తనే గట్టిగా కాటేసింది. తలభాగం కాటేయడంతో కలిగిన మంటకు పాము దేహం ఒక్కసారిగా మరింత వేగంతో కొట్టుకోవడం కనిపించింది.
Watch as decapitated snake bites it’s own body 😳 pic.twitter.com/lIneCEZvfU
— OddIy Terrifying (@OTerrifying) May 2, 2023