Site icon NTV Telugu

Nimmakayala Chinarajappa: పెద్దాపురం నుంచి మూడోసారి.. క్లారిటీ ఇచిన్న చినరాజప్ప

Nimmakayala Chinarajappa

Nimmakayala Chinarajappa

Nimmakayala Chinarajappa: టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా కొందరు నేతల సీట్లు గల్లంతు అవుతాయనే చర్చ సాగుతోంది.. అందులో కీలక నేతలకు సైతం మొండి చేయి తప్పదనే ప్రచారం సాగుతోంది.. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పెద్దాపురం నుంచి మూడోసారి పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే చిన రాజప్ప.. తాను గెలుస్తానని సర్వే రిపోర్ట్ లు కూడా చెబుతున్నాయన్న ఆయన.. కానీ, కొందరు నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.. వాళ్ల రాజకీయాల కోసం నా ఆరోగ్యం బాగాలేదని పోటీ చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, నేను ఆరోగ్యంగా ఉన్నానని, రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తుంటే నాపై లేనిపోని ప్రచారం చేస్తున్నారు అంటూ కౌంటర్ ఇచ్చారు. పెద్దాపురం అభివృద్ధి గతంలో ఎప్పుడూ లేనివిధంగా గత పదేళ్ల కాలంలో తాను ఎంతో పనిచేశాను.. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప.

Read Also: Deputy CM: సింగ‌రేణిలో 485 పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు వేయండి.. సింగరేణి సీ.ఎండీకి ఆదేశాలు

Exit mobile version