Minister RK Roja: వచ్చే ఎన్నికల్లోనూ తాను నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నట్టు సంకేతాలు ఇచ్చారు నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా.. తిరుమలలో ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. నగరి నుంచి బరిలో ఉంటాననే సంకేతాలను పంపించారు.. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుడూ.. నగరి నుంచి పోటీ చేస్తా.. హ్యాట్రిక్ కోడతానన్నారు రోజా.. కాగా, ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి రోజాను బరిలోకి దింపేందుకు వైసీపీ అధిష్టానం ఆలోచిస్తుందనే ప్రచారం సాగింది.. ఆ తర్వాత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.. దాదాపు ఆయన పేరు ఖరారు చేసినట్టు.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే తాను నగరి నుంచే మరోసారి పోటీ చేస్తానని మంత్రి రోజా స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.
Read Also: Gas Leakage: కెన్యాలో గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి, 165 మందికి గాయాలు..
మరోవైపు.. తిరుమలలో మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది.. ఒకే రాష్ర్టం.. ఒకే రాజధాని అంటూ మంత్రి ఆర్కే రోజా ముందు నినాదాలు చేశారు శ్రీవారి సేవకులు.. జై అమరావతి.. జైజై అమరావతి అంటూ నినాదాలు చేశారు.. అమరావతికి మద్దతు ఇవ్వాలంటూ మంత్రి రోజాను డిమాండ్ చేశారు శ్రీవారి సేవకులు.. అయితే, దేవుడి సన్నిధిలో ఇది సరికాదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రి ఆర్కే రోజా. కాగా, ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు కొనసాగుతోన్న విషయం విదితమే.. ఇప్పటికే ఐదు దఫాలుగా పలు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ అధిష్టానం.. కొన్ని స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చిన విషయం తెలిసిందే.