Site icon NTV Telugu

ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మను కలిసిన విద్యుత్ శాఖ ఏఈల సంఘం


కెఆర్ఎంబీ పరిధిలోకి శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణకు ఇవ్వొద్దని ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మను విద్యుత్ శాఖ ఏఈల సంఘం ప్రతినిధులు శుక్రవారం కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్ మాట్లాడు తూ ..శ్రీశైలం జల విద్యుత్ కేం ద్రం, జల విద్యుత్ కేంద్రంలో పని చేసే ఉద్యోగులను కెఆర్ఎంబీ పరిధిలోకి తెవొద్దని కోరినట్టు ఆయన తెలిపారు.

పవర్ ప్రాజెక్టుల్లో ఉన్న ఉద్యోగులు బోర్డు పరిధిలోకి వెళ్తే రెండు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటా యని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కేంద్రాలు పంపింగ్ మూడ్ లో ఉండనందున ఇబ్బందులు ఉండవు. కానీ తెలంగాణాలో ఆ తరహా ఇబ్బందులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పున:రాలోచించాలని కోరుతున్నట్టు విద్యుత్ శాఖ ఏఈల సంఘం నాయకులు తెలిపారు.

Exit mobile version