Site icon NTV Telugu

Private Train Service : జూన్‌ 4న పట్టలేక్కనున్న తొలి ప్రైవేట్‌ రైలు..

12

12

దేశంలోనే తొలి ప్రైవేటు రైలు జూన్ 4 న పట్టాలేక్కనుంది. కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. ఎస్‌ఆర్‌ఎంపీఆర్‌ గ్లోబల్‌ రైల్వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహించనుంది. పర్యాటకులను ఆకర్షించడమే ఈ రైలు ప్రధానలక్ష్యం. భారత్‌ గౌరవ్‌యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్‌ ట్రావెల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్త సహకారంతో ఈ ప్రైవేటు రైలు సర్వీసును నిర్వహిస్తున్నారు.

READ MORE: Air India Flights: సిబ్బంది సిక్ లీవ్.. 70 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు..

తిరువనంతపురం నుంచి గోవా మార్గంలో త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్‌, కోజికోడ్‌, కన్నూర్‌, కాసర్‌గోడ్‌ సహా పలు స్టేషన్లలో రైలు నిలుస్తుంది. ఇందులో 750 మంది ఒకే సారి ప్రయాణించవచ్చు. 2 స్లీపర్‌క్లాస్‌ కోచ్‌లు, 11 థర్డ్‌క్లాస్‌ ఏసీ కోచ్‌లు, 2 సెకండ్‌క్లాస్‌ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. వైద్య నిపుణులు సహా మొత్తం 60 మంది సిబ్బంది అందుబాటులో పనిచేస్తుంటారు. భోజన వసతి, వైఫై సదుపాయం, జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ అందుబాటులో ఉంటాయి. స్టార్‌ హోటల్‌ వసతి, భోజన సదుపాయంతోపాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించే టూర్‌ ప్యాకేజీలను కూడా అందించనున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు కొత్త సదుపాయాలు తీసుకొచ్చారు.

Exit mobile version