Site icon NTV Telugu

HCA: ఆర్చర్‌ చికితకు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్‌ రావు చేయూత..

Jagan Mohan Rao

Jagan Mohan Rao

ఆర్చర్‌ చికితకు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్‌ రావు చేయూత అందించేందుకు ముందుకొచ్చారు. అక్షర విద్యాసంస్థల నుంచి 10 లక్షల స్పోర్ట్స్‌ స్కాలర్‌షిప్‌ అందించారు. ఆర్చరీ వరల్డ్‌కప్‌, ఆసియాకప్‌కు ఎంపికైన పెద్దపల్లి యువ ఆర్చర్‌ టి.చికితరావుకు జగన్ మోహన్ రావు చేయూత అందించారు. సాధారణ రైతు కుటుంబ నుంచి అంతర్జాతీయ స్థాయి ఆర్చర్‌గా ఎదిగిన చికితకు సరైన ప్రోత్సాహం లేక ఇబ్బంది పడుతుందని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటానని అన్నారు. అక్షర విద్యా సంస్థల నుంచి చికితకు 10 లక్షల స్పోర్ట్స్‌ స్కాలర్‌షిప్‌ ఇస్తున్నాం.. తొలి విడతగా 50 వేల చెక్‌ను అందించామన్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి చికిత శిక్షణ నిమిత్తం ప్రతి నెల 15 వేల ఉపకార వేతనం ఐదేళ్ల పాటు అక్షర విద్యా సంస్థల నుంచి ఇవ్వనున్నామని జగన్‌మోహన్‌ రావు చెప్పారు.

Read Also: Samyuktha Menon: క్రేజియస్ట్ హీరోయిన్ సంయుక్త మీనన్.. చేతిలో అన్ని సినిమాలున్నాయా?

తెలంగాణ స్టేట్ జూనియర్ ఆర్చరీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆర్చర్‌‌‌‌‌‌‌‌ టి. చికిత రావు గోల్డ్ మెడల్ గెలిచింది. కొల్లూరు ఢిల్లీ ప‌‌‌‌బ్లిక్ స్కూల్ (డీపీఎస్‌‌‌‌)లో సోమవారం జరిగిన కాంపౌండ్ విభాగం ఫైనల్లో చికిత అందరికంటే ఎక్కువగా 697 పాయింట్లు సాధించి స్వర్ణం ఖాతాలో వేసుకుంది.

Exit mobile version