Site icon NTV Telugu

HCA: బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు రూ. 240 కోట్లు.. 20 రోజుల్లో రూ. 200 కోట్లు మాయం..!

Hca

Hca

HCA Funds Misuse: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ) నిధుల దుర్వినియోగంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఆడిట్ నిర్వహిస్తేనే నిధుల దుర్వినియోగంపై సీఐడీకి క్లారిటీ రానుంది. జగన్ మోహన్ రావు అధ్యక్షుడు అయిననాటి నుంచి బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు రూ. 240 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. ఇప్పుడు హెచ్‌సీఏ ఖాతాలో కేవలం రూ. 40 కోట్లు మాత్రమే ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. 20 నెలల్లో రూ. 200 కోట్లు ఖర్చు చేసింది హెచ్‌సీఏ. దేని కోసం ఖర్చు చేశారో బయట పడాలంటే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని సీఐడీ భావిస్తోంది. 2014 నుంచి హెచ్‌సీఏ అక్రమాలపై ఇప్పటికే రెండు సార్లు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించారు. తాజాగా సీఐడీ సిఫార్సుతో మరోసారి హెచ్‌సీఏలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించారు.

READ MORE: ఐకానిక్ టవర్ నిర్మించే ప్రాంతంలో నిలిచిన నీరు

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ నిధుల గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో నకిలీ బిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బీసీసీఐ గ్రాంట్లు, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ నిధులను నిందితులు కొల్లగొట్టినట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో తేలినట్లు ఇటీవల అధికారులు తెలిపారు. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ సెక్రటరీ దేవరాజ్ రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సీఐడీ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న దేవరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గత నెల 25న పుణెలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో ఈ నెల 7 నుంచి 13 వరకు కస్టడీలోకి తీసుకుని విచారించారు.

READ MORE: Sanju Samson: సంజు శాంసన్.. వర్కౌట్‌ కాదు! యాష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Exit mobile version